ఫిల్మ్ ఆఫ్‌ ది ఇయర్ ‘ఆర్ఆర్ఆర్’

.ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌ సోమవారం రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ‘ఫిలిం ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కించుకుంది. కన్నడ చిత్రసీమ నుంచి చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న ‘కాంతార’ సినిమాకు కూడా అవార్డు వచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ ‘మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌’ అవార్డును రిషబ్‌ శెట్టి దక్కించుకున్నాడు. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్‌(బ్రహ్మాస్త-1), ఉత్తమ నటిగా అలియా భట్‌(గంగూబాయి కాఠియావాడి) చిత్రాలకు పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా ది ‘కశ్మీర్ ఫైల్స్’ అవార్డు దక్కింది. చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవలందించినందుకు గానూ 2023 సంవత్సరానికి దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును రేఖ అందుకున్నారు.

Related Articles