TS: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్‌

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్దులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ అన్ని జిల్లా అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగా ప్రైవేట్ కాలేజీలతో లావాదేవీలు జరిపితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎప్పటికప్పుడు పరీక్షలపై సమాచారం తెప్పించుకుంటుందని, విద్యార్ధులు కూడఆ సమస్య ఉంటే తక్షణమే తెలియజేసేలా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం విద్యార్ధలకు కలిగే అసౌకర్యాలను అప్పటికప్పడు పరిష్కరించేందుకు అన్ని జిల్లాల్లో యంత్రాంగం పని చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,65,931 మంది ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరవుతున్నారు. వీరిలో 94,573 మంది ఒకేషనల్ పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తం 2,201 ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలని గత కొన్నేళ్లుగా డిమాండ్ వస్తోంది. కానీ ఈ ఏడాది వరకూ విద్యార్ధి చదివే కాలేజీల్లోనే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Related Articles