TS: నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం ప్రగతి భవన్‌లో గురువారం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్‌, చల్లా వెంకట్రామిరెడ్డి, కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గవర్నర్‌ కోటా కింద మరో రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. గవర్నర్‌ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు డి.రాజేశ్వర్‌రావు, ఫరూక్‌ హుస్సేన్‌ పదవీ కాలం మే నెలలో పూర్తి కానుంది. వీరి స్థానాల్లో కొత్త అభ్యర్థులను నామినేట్‌ చేయాల్సి ఉంది. ఇప్పటికే పలువురు ఆశావహులు లైన్‌లో ఉన్నారు. వీరిపై క్యాబినెట్‌లో చర్చించి ఇద్దరిని ఖరారు చేస్తారు. ఇటీవల బీఆర్‌ఎ్‌సలో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌, దాసోజు శ్రవణ్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బండి రమేశ్‌, ముక్కా సాంబశివరాజు, పీఎల్‌ శ్రీనివా్‌సలలో ఇద్దరిని అభ్యర్థులుగా ఎంపిక చేసే అవకాశముంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇప్పటికే ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థులు అగ్రకులాలకు చెందినవారు కావడంతో.. గవర్నర్‌ కోటా కింద ఇద్దరు అభ్యర్థులను ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అలాగైతే.. ఎస్సీ సామాజిక వర్గం కింద డి.రాజేశ్వర్‌రావును మళ్లీ కొనసాగించవ్చని తెలుస్తోంది. ఆయన కాదంటే టీఎ్‌సపీఎస్సీ మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణికి అవకాశం లభించవచ్చు. బీసీ సామాజిక వర్గం కింద బూడిద భిక్షమయ్య గౌడ్‌ పేరు వినిపిస్తోంది. ఈయన్ను పార్టీలో చేర్చుకునే సందర్భంలోనే బీఆర్‌ఎస్‌ అగ్ర నేతలు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్‌ చేసినట్లు సమాచారం. అందుకే ఆయనకు గవర్నర్‌ కోటా కింద అవకాశమివ్వచ్చని తెలుస్తోంది.

Related Articles