నేడే ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ అని నమ్మిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ‘ఆరోగ్య మహిళ’ పేరుతో వైద్యారోగ్య శాఖ రూపొందించిన ఈ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రారంభం కానున్నది. కరీంనగర్‌లోని బుట్టిరాజారాం కాలనీలో ఉన్న యూపీహెచ్‌సీలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలు కానున్నది. తర్వాత విద్యలో వనితకు అందలం అవనిపై ఆమెదే పైచేయి! సింగరేణి సిగలో స్త్రీ డిజిటల్‌ పురోగమనంలో మహిళ మహిళా శ్రేయోరాజ్యం తెలంగాణ సహనశీలి.. ప్రతిభాశాలి మహిళా దినోత్సవ ప్రత్యేక వ్యాసాలు వేదిక పేజీలో.. దశలవారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ఇందులో పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానలు ఉంటాయి. ఇక్కడ ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ‘ఉమెన్‌ క్లినిక్‌’లు నిర్వహిస్తారు. ఆడవారు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందిస్తారు.

Related Articles