రెండు రోజుల క్రితం ఘట్‌కేసర్ సమీపంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయింది. రైల్వే ట్రాక్‌ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనులు చేపట్టింది. ఈనేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు మార్గాల్లో రైళ్లను పాక్షికంగా రద్దుచేసింది. వాటిలో మెదక్- కాచిగూడ, నాందేడ్- ఆదిలాబాద్, మహబూబ్‌నగర్- కాచిగూడ, వరంగల్- కాచిగూడ, సికింద్రాబాద్- వరంగల్, చిత్తాపూర్-సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. కాచిగూడ- మెదక్ (07850) మధ్య నడిచే రైలు నేడు, రేపు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మెదక్ నుంచి కాచిగూడ (07588) మధ్య నడిచే రైలును ఫిబ్రవరి 17 నుంచి ఈనెల 19 వరకు రద్దు చేశారు. చిత్తూర్-సికింద్రాబాద్, రాయ్‌చూర్- గుంతకల్ మధ్య నడిచే రైళ్లు 17, 18 తేదీల్లో నడవవని చెప్పారు. వీటితో పాటు శుక్రవారం నడవాల్సిన ఆదిలాబాద్- నాందేడ్ (17409), నాదేండ్-ఆదిలాబాద్ (1740), కాచిగూడ-కర్నూల్ సిటీ, కర్నూల్ సిటీ- కాచిగూడ, చిత్తాపూర్- సికింద్రాబాద్- చిత్తాపూర్, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్- హైదరాబాద్, కాజిపేట్- వరంగల్, డోర్నకల్- విజయవాడ- డోర్నకల్, డోర్నకల్- కాజీపేట్, విజయవాడ- భద్రాచలం- విజయవాడ, కాచిగూడ -బోధన్, బోధన్- మహబూబ్‌నగర్, గుంతకల్- రాయ్‌చూర్ రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Related Articles
నేడు మీడియా ముందుకు కవిత
- March 9, 2023
రేపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నా
- March 9, 2023
TS: నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ
- March 9, 2023
తెలంగాణ బీజేపీ నేతలతో నేడు అమిత్ షా భేటీ..
- February 28, 2023
TS: నేడు వైద్య కళాశాలల బంద్
- February 27, 2023
నేడు హనుమకొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన
- February 27, 2023
నేడు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
- February 26, 2023
నేడు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి
- February 24, 2023