ట్యాంక్‌బండ్‌పై నేడు సన్‌డే ఫన్‌డే

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సన్‌డే ఫన్‌డేను సరికొత్తగా నిర్వహించనున్నారు. చాలా రోజుల తర్వాత నగర వాసులు కుటుంబ సమేతంగా ఎంజాయ్‌ చేసేలా ఏర్పాట్లు చేశామని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌ నీటిలో కొత్తగా మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేశామని, రాత్రి 7,8,9,10 గంటల సమయంలో ప్రతి గంటకోసారి 15 నిమిషాల పాటు 5-6 మ్యూజిక్‌ ట్యూన్‌లతో మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌లు అలరించేలా ఈ సారి సన్‌డే ఫన్‌డే ఉంటుందని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌ బండ్‌కు వాహనాలను వెళ్లకుండా హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టనున్నారు.

Related Articles