భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 262

భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు శనివారం ఆటలో ఆసీస్‌ బౌలర్లు భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ (5/67) ఈసారి లయ అందుకున్నాడు. అయితే భారత లోయరార్డర్‌లో అద్భుత పోరాటం కనిపించింది. కష్టాల్లో పడిన జట్టును స్పిన్‌ ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌ (74), రవిచంద్రన్‌ అశ్విన్‌ (37) ఆదుకున్నారు. విరాట్‌ కోహ్లీ (44), రోహిత్‌ (32) ఫర్వాలేదనిపించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 83.3 ఓవర్లలో 262 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌ ఒక్క పరుగు ఆధిక్యంతో సంతృప్తి పడింది. ఆ తర్వాత ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్‌ ఖవాజా (6)ను జడేజా అవుట్‌ చేసినా ట్రావిస్‌ హెడ్‌ (39 బ్యాటింగ్‌) వేగం కనబరిచాడు. అతడికి జతగా లబుషేన్‌ (16 బ్యాటింగ్‌) ఉండడంతో ఆసీస్‌ వికెట్‌ నష్టానికి 61 రన్స్‌ చేసింది. ప్రస్తుతం పర్యాటక జట్టు 62 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Related Articles