ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వస్తీవాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహనతో మొదటి రోజు క్రతువుతు ముగుస్తాయి. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి తిరు కల్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు అందజేయనున్నారు. కాగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను అధికారులు రద్దు చేశారు.
Related Articles
నేడు మీడియా ముందుకు కవిత
- March 9, 2023
TS: నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ
- March 9, 2023
తెలంగాణ బీజేపీ నేతలతో నేడు అమిత్ షా భేటీ..
- February 28, 2023
TS: నేడు వైద్య కళాశాలల బంద్
- February 27, 2023
నేడు హనుమకొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన
- February 27, 2023
నేడు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
- February 26, 2023
నేడు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి
- February 24, 2023
నేడు శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లు విడుదల
- February 24, 2023