కొండగట్టు అంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ప్రధాన ఆలయంలోని రెండు విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులు దొంగిలించినట్లు సమాచారం. ఆలయాన్ని మూసివేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఆలయం వెనుక గుట్ట దిగువన సీతమ్మ బావి వరకూ వెళ్లి డాగ్ స్క్వాడ్ ఆగిపోయింది. కాగా, ఇటీవలే కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్… ఆలయాభివృద్ధిపై అధికారులతో సుధీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆలయం కోసం రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, కొత్త నిర్మాణాలు, భక్తులకు వసతులపై రెండు గంటల పాటు చర్చించారు.