కెనడాలో ప్రమాదవవాత్తు మృతి చెందిందని భావించిన నిజామాబాద్ యువతి పూజితా రెడ్డి మృతికి కారణం తెలిసింది. విద్యార్ధిని మృతదేహాన్ని సోదరుడు స్వగ్రామానికి తీసుకురాగా.. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే… ఆమె గుండెపోటుతో కన్నుమూసిందని కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ గ్రామం పూజితా రెడ్డిది. ఆమె తండ్రి మల్కాపూర్ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి. పెద్ద కొడుకు కెనడాలో స్ధిరపడ్డాడు. పూజితా రెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసింది. పీజీ కోసం ఈ ఏడాది జనవరి26న కెనడా వెళ్లింది. అన్నయ్య ఇంట్లో వారం ఉండి, అనంతరం స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్‌లో చేరింది. అయితే పదిరోజుల కిందట గుండెపోటుకు గురై ఆకస్మాత్తుగా హాస్టల్ గదిలోనే కుప్పకూలింది. స్నేహితులు, సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. తమ మధ్య పెరిగి.. ఉన్నత చదువుల కోసం వెళ్లి.. గుండెపోటుతో చిన్న వయస్సులో హఠాన్మరణం చెంది.. విగత జీవిగా తిరిగి వచ్చిన పూజితను చూసి ఊరంతా కంట తడిపెట్టింది.
Related Articles
సైఫైనా, సంజయ్ అయినా వదిలిపెట్టేది లేదు..
- February 28, 2023
విజయవాడలో వైద్య విద్యార్ధి ఆత్మహత్య
- February 26, 2023
అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం
- February 23, 2023
వైద్య విద్యార్థినిపై ‘ర్యాగింగ్’
- February 23, 2023
ప్రాణం తీసిన పదోన్నతి
- February 22, 2023