కవితకు ఈడీ నోటీసులు.. కేంద్రం దుర్మార్గాలకు పరాకాష్ట

రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మోడీ దురాగతాలను బయట పెడుతున్న సీఎం కేసీఆర్‌పై కుట్రలో భాగమే కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోడీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. సూర్యాపేటలో తన నివాసంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కవితకు ఈడీ నోటీసులు మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. నియంతలు నిలబడిన చరిత్ర ఏనాడూ లేదన్నారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజా క్షేత్రంలో బట్టబయలు చేస్తామని వెల్లడించారు.

Related Articles