తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ జరిగింది. 2014 మే నుంచి 2023 డిసెంబర్ 7 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటి వరకు జరిగిన ఖర్చులతో సహా ప్రజలకు ఎంత ఖర్చు చేశారనే అంశాలను బహిర్గతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ భేటీ వివరాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇవాళ మీడియాకు వివరించారు. ఆరు గ్యారంటీలలో తొలుత రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఆయా శాఖల అధికారులతో చర్చించి 9వ తేదీన వాటిని మొదలు పెట్టే కార్యక్రమం చేపడతామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు పెంపును సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా అమల్లోకి తీసుకొస్తామని శ్రీధర్‌బాబు వెల్లడించారు. అలాగే ఈనెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేయొచ్చని వెల్లడించారు. రేపు విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు.
Related Articles
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
- February 10, 2024
రేపటి నుంచి ప్రజాదర్బార్..
- December 7, 2023
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం
- December 7, 2023
రేవంత్ రాజకీయ ప్రస్థానం
- December 5, 2023
రేవంత్ రెడ్డి ట్రెండింగ్
- December 5, 2023
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- December 5, 2023
TS: నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ
- March 9, 2023
తెలంగాణ బీజేపీ నేతలతో నేడు అమిత్ షా భేటీ..
- February 28, 2023