ఔను.. ర్యాగింగ్ చేశాను!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. పోలీసుల అదుపులో ఉన్న సీనియర్ పీజీ విద్యార్ధి సైఫ్ విచారణలో కీలక విషయాలు చెప్పాడు. ప్రీతిని ర్యాగింగ్ చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ ర్యాగింగ్ కారణమని పోలీసులు తెలిపినా.. అతడు ఖండిస్తూ వచ్చాడు. తాను సీనియర్‌ను కనుక ప్రీతి వృత్తి రిత్యా పొరపాట్లు చేయడం వల్ల తప్పని చెప్పానే కానీ.. అది ర్యాగింగ్ కాదని వాదించాడు. కానీ పోలీసులు వాట్సాప్ చాటింగ్‌లు బయటకు తీసి సైఫ్‌ ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని ర్యాగింగ్ చేసినట్లు నిర్ధారించి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసులు 4 రోజులు పాటు జరిపిన విచారణలో ఆధారాలు చూపించి సైఫ్‌ను ప్రశ్నించగా, తాను ర్యాగింగ్‌కు పాల్పడ్డది నిజమేనని, చాటింగ్‌ కూడా చేశానని సైఫ్ అంగీకరించినట్లు సమాచారం. ప్రీతి 22న ఆత్మహత్యకు పాల్పడటం.. ఆతర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించడం.. ఫిబ్రవరి 26న ఆమె మరణించడం తెలిసిందే.

Related Articles