ప్రీతిని వేధించిన సీనియర్ విద్యార్ధి సైఫ్ అరెస్ట్‌

కాకతీయ మెడికల్ విద్యార్ధిని ప్రీతిని వేధించిన సీనియర్ పీజీ విద్యార్ధి సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున మట్టేవాడ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని, దీనిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. ప్రీతిని వేధించినట్లు అతడి మొబైల్‌లో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఏసీపీ తెలిపారు. ప్రీతిపై వేధింపులు, ఆమె ఆత్మహత్యాయత్నం ఘటనల నేపథ్యంలో మట్టేవాడ పోలీసు స్టేషన్‌ను వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ సందర్శించారు. ఏసీపీ ఇతర పోలీసు అధికారులతో సమావేశమై ఘటనపై విచారించారు. మరోవైపు ప్రీతి హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ వైద్యులు విడుదల చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగ్గా ఉందని, నిపుణులైన వైద్య బృందం ప్రీతిని నిశితంగా పరిశీలిస్తోందని, ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్‌లో పేర్కొన్నారు.

Related Articles