పీజీ(అనస్థీషియా) మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన ద్వితీ య సంవత్సరం విద్యార్థి సైఫ్‌ను కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ శనివారం సస్పెండ్ చేశారు. నలుగురు సభ్యుల తో కూడిన విచారణ కమిటీ ఇచ్చిన శాఖాపరమైన నివేదికలో సైతం నిందితుడిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. పోలీసులు నిందితుడిపై ర్యాగింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు రిమాండ్‌కు తరలించిన నేపథ్యంలో కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడికి శిక్ష ఖరారైతే అడ్మిషన్ రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు.