ప్రీతిని సైఫ్‌ వేధించాడు..

ఆత్మహత్యకు పాల్పడిన మెడికల్‌ స్టూడెంట్‌ ప్రీతిని సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ మానసికంగా వేధించాడని యాంటీ ర్యాగింగ్‌ కమిటీ స్పష్టం చేసింది. మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డా.మోహన్‌దాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు జరిగిన పరిణామాలపై ఈ కమిటీ చర్చించింది. పీజీ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో హేళన చేస్తూ ప్రీతిపై సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ పోస్టింగ్‌లు పెట్టినట్టు కమిటీ పేర్కొంది. ప్రీతి, సైఫ్‌కు కౌన్సిలింగ్‌ ఇచ్చిన అనస్తీషియా విభాగం హెచ్‌వోడి నాగార్జునరెడ్డిని పిలిపించి కమిటీ సభ్యులు విచారించారు. సైఫ్‌ తనను టార్గెట్‌ చేస్తూ వేధించాడని ప్రీతి పేర్కొందని. ఆ సమయంలో ఆమె ఏడ్చినట్లు తెలిపారు. దీంతో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి.. జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు నాగార్జున్‌రెడ్డి కమిటీకి తెలిపారు. ఆ తర్వాత కూడా ప్రీతిని సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ వేధించినట్లు కమిటీ తెలిపింది.

Related Articles