ఆగిపోయిన రియల్ ఎస్టేట్ వెంచర్లను సత్వరం ప్రారంభించి పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రియల్ ఎస్టేట్ ఫండ్‌కు చివరి నిమిషంలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆగిన రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం రూ. 25,000 కోట్ల ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)ను కేంద్ర ప్రారంభించింది. ఈ ఫండ్‌కు ఇప్పటికే పలు సంస్థలు రూ. 10,530 కోట్లు ఇచ్చాయి. ఈ ఫండ్ నుంచి నిధులు తీసుకునేందుకు భారీ సంఖ్యలో రియల్ ఎస్టేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. చివరి నిమిషంలో ఏకంగా 400లకు పైగా దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీటికి తొలి విడత రుణాల వితరణ ఈనెలలొనే ప్రారంభం కావొచ్చు. ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఫండ్‌కు ఎస్బీఐ, ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీతో పాటు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిధులు సమకూర్చుతున్నాయి. నిరర్థక ఆస్తిగా మారిన కంపెనీలు లేదా దివాళ కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలు కూడా ఈ ఫండ్ నుంచి నిధులు తీసుకోవచ్చు.