రియల్‌ ఎస్టేట్‌: ధరలు 5 % పెరుగుతాయి

వచ్చే ఏడాదిలో రియల్‌ ఎస్టేట్‌ ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది. కరోనాతో ఈ ఏడాది ఆటుపోట్లు ఎదుర్కొన్న స్థిరాస్థి రంగం వచ్చే ఏడాది స్థిరంగా ఉండొచ్చని పేర్కొంది. ‘2022 అవుట్‌లుక్‌ రిపోర్ట్‌’ లో ఈ వివరాలను పేర్కొంది. ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు అధికంగా ఉన్నందున ఆఫీసు స్థలానికి వచ్చే గిరాకీ పెరుగుతుందని పేర్కొంది. ‘ఫ్లెక్సిబుల్‌ ఆఫీసు స్పేస్‌’ కు గిరాకీ ఇంకా అధిక గిరాకీ ఉంటుందని వివరించింది. సాధారణ ఇళ్ళకు బదులు విశాలంగా, అధునాతన సదుపాయాలు కల ఇళ్లను వినియోగదార్లు ఇష్టపడుతున్నారని నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది.

Related Articles