ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుడులు 5 శాతం వరకు పెరిగి రూ. 46,000 కోట్లకు చేరే అవకాశముంది. ఇందులో చాలా వరకు పెట్టుబడులు కమర్షియల్ రియల్ ఎస్టేట్ విభాగానికి మరలే అవకాశముందని కొలియర్స్ అనే కన్సల్టెంట్ అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల రాక తగ్గనుంది. 2018తో పోలిస్తే 2019లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు 8.7 శాతం పెరిగాయి. 2020లో మాత్రం పెరుగదల 5 శాతం వరకు మాత్రమే పరిమితం కానుంది. గత ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 78శాతం మొత్తం విదేశీ పెట్టుబడుల రూపంలో వచ్చినవే. 2008 నుంచి 2019 వరకు మన దేశ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ రూ. 4,10,000 కోట్లు.
రానున్న మూడేళ్ళలో కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కు మంచి డిమాండ్ ఉందని కొలియర్స్ పేర్కొంది.2020లో వచ్చే పెట్టుబడుల్లో 40 శాతం మొత్తం కమర్షియల్ స్పేస్ విభాగానికే వెళ్ళనుంది.