రైతులు పండించే ప్రతి వరి గింజనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘వరిదీక్ష’లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ దీక్షకు హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఒకరినొకరు పరస్పరం పలకరించుకున్నారు… కలిసి అభివాదం కూడా చేశారు. ఈ ఇద్దరి కలయికతో అటు రేవంత్, కోమటిరెడ్డి అభిమానుల్లో.. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయ్యింది. పీసీసీ పదవి తనకు దక్కకపోవడంతో పార్టీ అధిష్టానం పట్ల, స్ధానిక నేతల పట్ల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.
ఒకే వేదికపై కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి
Related Articles
డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఫిర్యాదు
- November 2, 2025
అంతలా జీడీపీ ఎలా పెరిగింది?
- February 29, 2024
ఇది కేవలం జగన్ కక్ష సాధింపే
- February 29, 2024
