పెద్దిరెడ్డికి బాబు సవాల్‌

కుప్పంలో వైకాపా నేతలు హింస, దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ కుప్పం వచ్చారు. కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పుంగనూరు నుంచి వచ్చిన వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తానని పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హెచ్చరించారు. ఈసారి వైకాపాకు తన నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రాకూడదని అన్నారు. కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. మళ్ళీ అధికారంలోకి రాగానే పోలీసులతో వైకాపా గూండాలను నియంత్రిస్తామని అన్నారు. వైకాపా నాయకులు విచ్చలవిడిగా గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నారని.. ‘కేజీయఫ్‌’ తరహాలో శాంతిపురంలో గ్రానైట్‌ తవ్వేశారని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా నేతలు రికార్డులు మార్చేసి పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా నేతల వేధింపుల వల్లే కడప జిల్లాకు చెందిన సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని అన్నారు. ఆయన కుమార్తెకు భరోసా ఇచ్చా. భూమి అప్పగిస్తామని చెప్పానని అన్నారు.

Related Articles