గుంటూరు జిల్లా తాడేపల్లికి సమీపంలో ఇప్పటం గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. క్రేన్ సాయంతో విగ్రహాన్ని తరలించారు. ఇటీవల రోడ్డు విస్తరణ పేరుతో గ్రామంలో పలు ఇళ్లను అధికారులు కూలగొట్టిన విషయం తెలిసిందే. విస్తరణ సమయంలో గాంధీ, నెహ్రూ, పీవీ వంటి మహానుభావుల విగ్రహాలు తొలగించిన అధికారులు వైఎస్ విగ్రహం తొలగించలేదు. పైగా వైఎస్ విగ్రహానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇళ్ల కూల్చివేతపై ఇప్పటి గ్రామాన్ని సందర్శించిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. గొప్ప మహానుభావుల విగ్రహాన్ని తొలగించిన అధికారులు రోడ్టు మీదకు ఉన్న వైఎస్ విగ్రహం ఎందుకు తొలగించలేక పోయారని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. పైగా ముళ్ల కంచెల ద్వారా విగ్రహానికి పోలీసు బందోబస్తుపై కూఆ విమర్శలు చేశారు. సోషల్ మీడియా లోనూ ఇదే అంశంపై ప్రభుత్వం వైఖరిపై సెటైర్లు వస్తుండటంతో స్పందించిన అధికారులు… ఇవాళ వైయస్ విగ్రహం తొలగించారు.