రాష్ట్రంలో ఇంగ్లిషు మీడియాలో విద్యాబోధన జరగాలన్న జగన్ ప్రభుత్వం నిర్ణయంపై జనసేన నేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. ఇంగ్లీషు భాషని వద్దని ఎవరు చెప్పటం లేదని, కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలని ఆయన ట్వీట్‌చేశారు. మాతృభాషని, మాండలికాలను సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. మాతృ భాషను మృత భాషగా మార్చవద్దని ఆయన ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ,తెలుగుని చంపేసే ఆలోచన ,భస్మాసుర తత్వాన్ని సూచిస్తుందని జనసేనాని పవన్ విమర్శించారు. మా తెలుగు తల్లి అని పాడాల్సిన జగన్‌గారు.. తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ రెడ్డి గారు..
‘మా తెలుగు తల్లి’ అని పాడాల్సిన మీరు
’తెలుగు భాష తల్లినే’చంపేస్తున్నారు— Pawan Kalyan (@PawanKalyan) November 19, 2019
తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ,తెలుగుని చంపేసే ఆలోచన ,భస్మాసుర తత్వాన్ని సూచిస్తుంది.
— Pawan Kalyan (@PawanKalyan) November 19, 2019
మాతృ భాషని ,మృత భాషగా మార్చకండి.’
— Pawan Kalyan (@PawanKalyan) November 19, 2019
ఇంగ్లీషు భాష ని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు’ జగన్ రెడ్డి గారు’ చెప్పాలి.
మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే…— Pawan Kalyan (@PawanKalyan) November 19, 2019
జగన్ రెడ్డి గారు ‘ భాష సరస్వతిని అవమానించకండి.’ pic.twitter.com/i5vkyQom4V
— Pawan Kalyan (@PawanKalyan) November 19, 2019