ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో పాతాళగంగ కిటకిటలాడుతుంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఆదిదంపతులను దర్శించుకుంటున్నారు. భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు నిండిపోయాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు నందివాహన సేవ నిర్వహించనున్నారు. జగద్గురు పీఠాధిపతి.. మల్లికార్జునుడికి అభిషేకం చేయనున్నారు. రాత్రి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం చేస్తారు.