రామ్ చ‌ర‌ణ్‌కి సారీ చెప్పిన అమెరికన్‌ న‌టి…

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డ్స్‌లో సందడి చేశారు. ఈ వేడుకలో చరణ్‌ అవార్డుల ప్రెజంటర్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అమెరికన్‌ స్టార్‌ నటి టిగ్‌ నొటారో చరణ్‌ పేరును పలికేందుకు ఇబ్బంది పడ్డారు. ఓ కేటగిరీలో అవార్డును ప్రదానం చేయడానికి రామ్‌చరణ్‌ను వేదికపై పిలిచే క్రమంలో చరణ్‌ అని పలకడం రాక తడబడ్డారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో విజయాన్ని అందుకున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ సూపర్‌స్టార్‌ రామ్‌.. అంటూ చరణ్‌ అనే పదాన్ని ఎలా పలకాలో తెలియడం లేదని అన్నారు. స్టేజ్‌ వెనుక ఉన్న బృందం సాయం చేయడంతో అతికష్టం మీద చరణ్‌ అని పలికారు. రామ్‌చరణ్‌ చిరునవ్వుతో వేదికపైకి వెళ్లారు. ఆ వెంటనే టిగ్‌ నొటారో.. చరణ్‌ వద్దకు వెళ్లి క్షమాపణలు తెలియజేశారు. అనంతరం హాలీవుడ్‌ నటి అంజలీ భీమానితో కలిసి బెస్ట్‌ వాయిస్‌, మోషన్‌ క్యాప్చర్‌ అవార్డును చరణ్‌ అందించారు.

Related Articles