మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ విచారించడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అవినాశ్‌రెడ్డిని రెండుసార్లు హైదరాబాద్‌కు పిలిపించి విచారించింది. ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని కూడా ఈ నెల 23న విచారణకు రావాలని నోటీసు జారీ చేసింది. అయితే ఆ రోజు కుటుంబ పనులు ఉన్న కారణంగా మరో రోజు వస్తానని భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో శనివారం సెంట్రల్ జైలు అతిథిగృహంలో ఆయన విచారణకు హాజరవుతారని ప్రచారం జరిగింది. హైదరాబాద్ నుంచి సీబీఐ బృందం సైతం కడపకు చేరుకుంది. మీడియా ప్రతినిధులు కూడా ఉదయం 9.30 గంటలకల్లా సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. అయితే సీబీఐ నుంచి తనకు ఎలాంటి నోటీసూ రాలేదని భాస్కర్‌రెడ్డి తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. నోటీసు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, రమ్మంటే విచారణకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు మెసేజ్ పెట్టడంతో పాటు ఫోను కూడా చేసినట్లు సమాచారం. దీనిపై ఎలాంటి సమాధానం రాలేదని తెలిసింది. దీంతో ఉదయం నుంచి కడపలో ఉన్న భాస్కర్‌రెడ్డి సాయంత్రం పులివెందుల వెళ్లినట్లు సమాచారం.
వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణపై ఉత్కంఠ
Related Articles
డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఫిర్యాదు
- November 2, 2025
అంతలా జీడీపీ ఎలా పెరిగింది?
- February 29, 2024
ఇది కేవలం జగన్ కక్ష సాధింపే
- February 29, 2024
