13 మంది సజీవ దహనం

మార్కాపురం జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌- ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుతో పాటు టిప్పర్‌లోనూ మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. బస్సులోని 13 మంది సజీవ దహనం కాగా మరో 15 మందికి గాయాలయ్యాయి.బస్సును హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. గురువారం ఉదయం 6-6.30 గంటల మధ్య ఈ ఘోరం జరిగింది. ఘటనాస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఈ ప్రమాదంలో బస్సు, టిప్పర్‌ పూర్తిగా కాలిపోయాయి
ఈ బస్సు హరికృష్ణ ట్రావెల్స్‌ది గుర్తించారు
హైదరాబాద్‌ నుంచి పామూరు వైపు బస్సు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
ప్రమాదం జరిగినపుడు బస్సుల్లో 30 మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.
టిప్పర్‌ అతివేగంతో ఈ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తు్నారు.
బస్సు ముందు భాగంలో ఉన్నవారు బయటపడగా, చివర్న ఉన్నవారు చిక్కుకున్నారు
మృతుల్లో కనిగిరి, పామూరు ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply