
దక్షిణ కొరియా కంపెనీ కియా మోటార్స్ తన లోగోను మార్చనుంది. ఇప్పటికే కొత్త లోగో కోసం కొరియా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కు కంపెనీ దరఖాస్తు చేసుకుంది. కొత్త లోగోను ఎరుపు రంగులో తయారు చేశారు. కొత్త కంపెనీ తేనున్న మోడల్స్‌పై కొత్తలోగోన కంపెనీ ప్రదర్శించడం చూస్తుంటే… త్వరలోనే లోగో మారడం ఖాయంగా కన్పిస్తోంది. మారుతున్న టెక్నాలజీ, ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త లోగోను డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ రంగంలో కూడా కంపెనీ ప్రవేశించబోతోందని… ఈ వెహికల్స్‌కు సరిపోయేలా కొత్త లోగోను డిజైన్ చేసినట్లు ఆ వర్గాలు తెలిపారు.
