మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీస్‌కు చేరుకుంది. భారత్ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే, గబీ లూయిస్, కెప్టెన్ లారా డెలనీ ఇద్దరూ కలిసి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. 8.2 రెండు ఓవర్ల వద్ద వర్షం కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. అప్పటికి ఐర్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. గబీ లూయిస్ 32, లారా డెలనీ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆ తర్వాత కూడా మ్యాచ్ కొనసాగకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
Related Articles
అంతలా జీడీపీ ఎలా పెరిగింది?
- February 29, 2024
CAA: బీజేపీ మరో ఎన్నికల అస్త్రం
- February 10, 2024
నిరాశపర్చిన జీడీపీ వృద్ధిరేటు
- February 28, 2023
గెలుపు ముంగిట భారత్ బోల్తా
- February 24, 2023
ఆసీస్ 263 ఆలౌట్
- February 18, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
- February 17, 2023
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ జోరు
- February 16, 2023