డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ స్థూల జాతీయ (జీడీపీ) వృద్ధి రేటు మందగించింది. ఈ సమయంలో జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతంగా ఉందని కేఉంద్రం ప్రకటించింది. ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచడంతో పాటు ఎగుమతులు మందగించడం, దేశీయంగా డిమాండ్ తగ్గడం కూడా కారణాలుగా ఆర్థికవేత్తలు అంటున్నారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్థిర ధరల (2011-12) ప్రకారం చూస్తే జీడీపీ గత ఏడాది కాలంలోని రూ.38.51 లక్షల కోట్లతో పోలిస్తే 4.4 శాతం పెరిగి రూ.40.19 లక్షల కోట్లకు చేరింది. అదే ప్రస్తుత ధరల వద్ద లెక్కిస్తే జీడీపీ 11.2 శాతం వృద్ధితో రూ.62.39 లక్షల కోట్ల నుంచి రూ.69.38 లక్షల కోట్లకు చేరింది. తాజా గణాంకాల ప్రకారం 2022-2023 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని కేంద్రం పేర్కొంది. 2021-22 లో జడీపీ వృద్ధి రేటును 8.7 శాతం నుంచి 9.1 శాతానికి సవరించారు. కరోనా కాలంలో జీడీపీ వృద్ధి రేటు బాగా మందగించడం, ఆ తరవాత దాని ఆధారంగా తాజా డేటాను లెక్కించడంతో భారీ వృద్ధి రేటు కన్పించింది. ఇపుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో… వృద్ధి రేటు స్పీడు తగ్గింది.
Related Articles
అంతలా జీడీపీ ఎలా పెరిగింది?
- February 29, 2024
CAA: బీజేపీ మరో ఎన్నికల అస్త్రం
- February 10, 2024
సెమీస్‌లో భారత్
- February 21, 2023
ఆసీస్ 263 ఆలౌట్
- February 18, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
- February 17, 2023
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ జోరు
- February 16, 2023
హాకీ: 49 ఏళ్ళ తరవాత…
- August 1, 2021