మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దీప్తి శర్మ (3/15) బంతితో.. రిచా ఘోష్ (32 బంతుల్లో 5 ఫోర్లతో 44 నాటౌట్) బ్యాట్‌తో రాణించడంతో.. గ్రూప్-బిలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్లతో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. తొలుత వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 118/6 స్కోరు చేసింది. స్టెఫానీ టేలర్ (42), షిమైన్ క్యాంప్‌బెల్ (30) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో భారత్ 18.1 ఓవర్లలో 119/4 స్కోరు చేసి గెలిచింది. హర్మన్‌ప్రీత్ (42 బంతుల్లో 3 ఫోర్లతో 33), షఫాలీ వర్మ (28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గాయం నుంచి కోలుకొన్న స్మృతి మంధాన జట్టులోకి వచ్చింది.
Related Articles
అంతలా జీడీపీ ఎలా పెరిగింది?
- February 29, 2024
CAA: బీజేపీ మరో ఎన్నికల అస్త్రం
- February 10, 2024
నిరాశపర్చిన జీడీపీ వృద్ధిరేటు
- February 28, 2023
గెలుపు ముంగిట భారత్ బోల్తా
- February 24, 2023