భారత్‌కు షాక్‌

వన్డే ఫార్మాట్‌లో తిరుగులేని ఆధిపత్యంతో దూసుకెళుతున్న టీమిండియాకు వెస్టిండీస్‌ షాకిచ్చింది. హెట్‌ మయెర్‌ (106 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 139) తుపాన్‌ ఇన్నింగ్స్‌కు షాయ్‌ హోప్‌ (151 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 102) సెంచరీ తోడైంది. దీంతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్‌ బుధవారం విశాఖలో జరుగుతుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 71), శ్రేయాస్‌ అయ్యర్‌ (88 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 70) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. జాదవ్‌ (35 బంతుల్లో 40), రోహిత్‌ (56 బంతుల్లో 36) పర్వాలేదనిపించారు. 288 పరుగల టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్‌ 47.5 ఓవర్లలో 2 వికెట్లకు 291 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హెట్‌మయెర్‌ నిలిచాడు.

స్కోరుబోర్డు
భారత్‌: రోహిత్‌ శర్మ (సి) పొలార్డ్‌ (బి) జోసెఫ్‌ 36; రాహుల్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) కాట్రెల్‌ 6; కోహ్లీ (బి) కాట్రెల్‌ 4; శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) పొలార్డ్‌ (బి) జోసెఫ్‌ 70; పంత్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) పొలార్డ్‌ 71; జాదవ్‌ (సి) పొలార్డ్‌ (బి) పాల్‌ 40; జడేజా (రనౌట్‌) 21; దూబే (సి) హోల్డర్‌ (బి) పాల్‌ 9; దీపక్‌ చాహర్‌ (నాటౌట్‌) 7; షమి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 24; మొత్తం: 50 ఓవర్లలో 287/8.
వికెట్ల పతనం: 1-21, 2-25, 3-80, 4-194, 5-210, 6-269, 7-269, 8-282. బౌలింగ్‌: కాట్రెల్‌ 10-3-46-2; హోల్డర్‌ 8-0-45-0; హేడెన్‌ వాల్ష్‌ 5-0-31-0; పాల్‌ 7-0-40-2; జోసెఫ్‌ 9-1-45-2; చేజ్‌ 7-0-42-0; పొలార్డ్‌ 4-0-28-1.

విండీస్‌: హోప్‌ (నాటౌట్‌) 102; ఆంబ్రిస్‌ (ఎల్బీ) చాహర్‌ 9; హెట్‌మయర్‌ (సి) అయ్యర్‌ (బి) షమి 139; పూరన్‌ (నాటౌట్‌) 29; ఎక్స్‌ట్రాలు: 12
మొత్తం: 47.5 ఓవర్లలో 291/2.
వికెట్ల పతనం: 1-11, 2-229. బౌలింగ్‌: చాహర్‌ 10-1-48-1; షమి 9-1-57-1; కుల్దీప్‌ 10-0-45-0; దూబే 7.5-0-68-0; జాదవ్‌ 1-0-11-0; జడేజా 10-0-58-0.

Related Articles