కరోనాతో ఇబ్బంది పడుతున్న సీనియర్ నటుడు సత్యరాజ్ నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్ సోకడంతో ఇంటి వద్దే ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే అకస్మాతుగా ఆయన హాస్పిటల్లో చేరడంతో ఆయన ఆరోగ్యంపై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయనకు సీరియస్గా ఉందని కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయి. అయితే హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. చాలా మంది నటీనటులు ఇటీవల కరోనా బారిన పడుతున్నారు.