ఆదివారం టెస్ట్లు తక్కువగా జరగడంతో మొన్న కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. నిన్న మళ్ళీ పుంజకున్నాయి. దేశ వ్యాప్తంగా 2,67,246 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు ఇపుడు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం నిన్న ఒక్క రోజే దేశంలో 4,530 మంది మరణించారు. మహారాష్ట్రలోనే 1.291 మంది, కర్ణాటకలో 525 మంది మరణించారు. తమిళనాడులో 364 మంది అసువులు బాసారు. యూపీలో కరోనా కేసులు కేవలం 8,673 మాత్రమే కాగా, మరణాల సంఖ్య 255 దాకా ఉంది. ఇక ఢిల్లీలో కరోనా కేసుల కేవలం 4482 కానీ మరణాలు మాత్రం 265. కేరళలో ఎప్పటిలాగే కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. నిన్న మరో 31,337 మందికి కరోనా సోకినా.. మరణాలు 97 మాత్రమే.
Related Articles
అంతలా జీడీపీ ఎలా పెరిగింది?
- February 29, 2024
CAA: బీజేపీ మరో ఎన్నికల అస్త్రం
- February 10, 2024
నిరాశపర్చిన జీడీపీ వృద్ధిరేటు
- February 28, 2023
సెమీస్లో భారత్
- February 21, 2023
ఆసీస్ 263 ఆలౌట్
- February 18, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
- February 17, 2023
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ జోరు
- February 16, 2023