ప్రతి రైతూ చూడాల్సిన వీడియోలు ఇవి….

ఓట్లకు ముందు రైతు మాట ఎత్తని రాజకీయ నేత ఉండడు. కాని కాలం మారుతోంది. రైతుతో సంబంధం లేకుండా కార్పొరేట్‌ శక్తులతో అధికారం చేజిక్కుంచుకోవచ్చని నేటితరం రాజకీయ నేతలకు అర్థమౌతోంది. ఉద్యమం చేస్తున్నవారిది తప్పా? వారి కోర్కెలు సమంజసమా కాదా? ఇవన్నీ పక్కన బెడదాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలు తమకు గుదిబండగా మారుతాయని భావించిన రైతులు చలో ఢిల్లీకి పిలుపు ఇచ్చారు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల రైతులు ట్రాక్టర్లతో, కాలి నడకతో బయలు దేరారు. మూడు రోజుల నుంచి వీరి ప్రయాణం సాగుతోంది. ఎక్కడా గొడవ లేదు. ఎక్కడిక్కడ వారికి భోజనం ‘లంగర్‌’ లభిస్తోంది. వారు ఎవరికీ ఎక్కడా ఇబ్బంది కల్గించలేదు. కాని సరిహద్దులో ఉన్న హర్యా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఎన్నో ఇబ్బందులు కల్గించినా వాటిని అధిగమించి వచ్చారు. ఇపుడు ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చారు. ఢిల్లీలోకి రైతులు రాకుండా హర్యానా, యూపీ ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ పోలీసులు (వీరు అమిత్‌ షా నియంత్రణలో ఉంటారు… కేజ్రివాల్‌ కాదు) రైతులను ఎలా అడ్డుకున్నారో చూడండి.

కందకాలు తొవ్వుతారా?

మీరు చదువుకునే సమయంలో కందకాలు అనే పదం పొరుగు దేశాల సరిహద్దుల వద్ద ఉంటాయి. సైన్యం వీటిని తవ్వుతుంది. ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టేందుకు. కాని ఢిల్లీకి వెళుతున్న రైతులను అడ్డుకునేందుకు, వారి ట్రాక్టర్లను ఆపేందుకు ఏకంగా రాష్ట్ర పోలీసులు కందకాలు తవ్వారంటే… ప్రతి రోజూ ఆలోచించాల్సిందే. ఇది…

ఈ వీడియో చూడండి. ఇవి కంటైనర్లు. భారీగా సరుకు రవాణా కోసం ఉపయోగిస్తారు. వీటిని ఢిల్లీ, హర్యానా, యూపీ పోలీసులు రోడ్డుకు అడ్డంగా పెట్టేశారు. రైతులు స్వయంగా రంగంలోకి దిగి వాటిని తొలగిస్తున్న దృశ్యాలు ఇవి. మన దేశంలో మన అన్నదాతకు శాంతియుత ప్రదర్శనకు వెళుతున్నవారికి ప్రభుత్వ మర్యాద ఇది.

ఇసుక తిన్నెలు…
ఆశ్చర్యంగా ఉంది కదూ.నిజమే ఇవి కూడా కందకాల్లాంటివే. రైతుల ట్రాక్టర్లు వెళ్ళకుండా ఉండేందుకు రోడ్డుపై వేసిన, వేసేందుకు సిద్ధంగా ఉంచి ఇసుక తిన్నెలు. వందల లోడ్ల ఇసుకను రోడ్లపై వేశారు. రోడ్ల పక్కన నిల్వ ఉంచారు. కాని రైతుల ఇంక్విలాబ్‌ నినాదం ముందు ఇవి నిలబడలేదు.

ముఖం మీద పడుతున్నా…

చాలా శక్తివంతంగా, వేగంగా నీటిని చిమ్మే వాటర్‌ క్యానన్లు. ఇవి ఎవరిపై? ఎందుకు ప్రయోగిస్తారు? అదుపు సాధ్యం కాని గుంపులపైన? మరి ఇక్కడ ప్రశాంతగా ట్రాక్టర్‌పై వెళుతున్న రైతుల ముఖంపైకే విరజిమ్ముతున్న వాటర్‌ క్యానన్లు ఎక్కడైనా చూశారా?


ఇవి భాష్పవాయువు గోళాలు. ఇవి కూడా అదుపు చేయడం కష్టమనుకునే సమయంలో పోలీసులు వాడుతారు. కాని సరిహద్దుల వద్ద దారి ఇవ్వమని ప్రాధేయపడుతున్న రైతులను బెదిరించేందుకు ఇలా భాష్పవాయువు గోళాలను ప్రయోగించడం ఎపుడైనా చూశారా? ఇంకా రోడ్లకు సిమెంటు దిమ్మలు కూడా ఉంచారు. కాని ఇవన్నీ రైతు సంకల్పం ముందు బాలాదూర్‌.

ప్రభుత్వం ఇంత చేసినా ఎక్కడా రైతులు అదుపు తప్పలేదు. ఎక్కడిక్కడ తమకు అడ్డుగా వచ్చినవాటినే వారు తొలగించుకున్నారు. ఎక్కడా పోలీసులతో గొడవ పడలేదు. కాని అడ్డుకున్న పోలీసులను ఓ రైతు బిడ్డ ఇలా నిలదీశాడు. తమకు జరుగుతున్న న్యాయాన్ని పోలీసులకు వివరించే ప్రయత్నం చేశాడు.

Related Articles