ఢిల్లీ మద్యం కుంభకోణంలో నేరపూరిత కుట్ర జరిగిందనడానికి సరిపడా ఆధారాలున్నాయని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులకు బెయిల్ నిరాకరించింది. కుంభకోణంలో భాగంగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అరెస్టు చేసిన నిందితులు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, హైదరాబాద్ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, మద్యం వ్యాపారులు సమీర్ మహేంద్రు, బినయ్ బాబు, ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యునికేషన్ ఇన్‌చార్జిగా వ్యవహరించిన విజయ్ నాయర్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ గురువారం 123 పేజీల తీర్పును వెలువరించారు. తీర్పు కాపీలో సీబీఐ, ఈడీచార్జిషీట్లలో పేర్కొన్న అంశాలను అవసరమైన చోట ప్రస్తావించారు. అలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తీర్పు కాపీలో నాలుగు చోట్ల సౌత్ గ్రూప్ భాగస్వామి హోదాలో కనిపించింది.
Related Articles
నేడు మీడియా ముందుకు కవిత
- March 9, 2023
రేపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నా
- March 9, 2023
ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్
- February 23, 2023
ఎంపీ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి
- February 20, 2023
నేడు భారత్, ఆసీస్ మధ్య రెండో టెస్టు
- February 17, 2023
ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ కానుక
- August 3, 2021