ఇక జగదీశ్వర్‌ రెడ్డి వంతు?

టీఆర్‌ఎస్‌లో ఈటల రాజేందర్ చాప్టర్‌ ముగిసింది. ఇక విద్యుత్ శాఖ మంత్రి జగదేశ్వర్‌ రెడ్డిని సాగనంపే కార్యక్రమం టీఆర్‌ఎస్‌లో మొదలైనట్లు కన్పిస్తోంది. దీనికి సంబంధించి ఇవాళ డెక్కన్‌ క్రానికల్‌లో ఓ కథనం వచ్చింది. ఈ ఏడాది జనవరిలో తన కుమారుడి బర్త్‌డే ఫంక్షన్‌ సందర్భంగా జగదీశ్వర్‌ రెడ్డి ఏర్పాటు చేసిన విందులో నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారని… ఆ బర్త్‌డే ఫంక్షన్‌ ఏకంగా కేసీఆర్‌ వ్యతిరేక ఫంక్షన్‌గా మారిందని ఆ పత్రికలో కథనం వచ్చింది. అందులో కేటీఆర్‌ సీఎం అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ ఎమ్మెల్యే ఏకంగా ఓ పాట పాడారని, అది ప్రగతి భవన్‌ చేరిందని తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి ఆరా తీశారని… మొత్తం వివరాలు ఆయన వద్ద ఉన్నాయని అంటున్నారు. పైగా ఈటల రాజేందర్‌ ఇటీవల పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే… జగదీశ్వర్‌రెడ్డి కనీసం స్పందించకపోవడంపై గులాబీ నేత గుర్రుగా ఉన్నారట.జగదీశ్వర్‌ రెడ్డి స్థానంలో మరో రెడ్డినేతను కేసీఆర్‌ వెతుకుతున్నారని… పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సరిపోతారని కూడా గులాబీనేత భావిస్తున్నారట. ఇప్పటి వరకు పార్టీలో జరుగుతున్న చర్చ ఇవాళ మీడియాలో రావడం, ఎంపీ రేవంత్‌ రెడ్డి దీన్ని ట్వీట్‌ చేయడంతో ఇపుడు టీఆర్‌ఎస్‌లో కొత్త రచ్చ మొదలైంది.

Related Articles