ఖమ్మం టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు నివాసంతోపాటు ఆఫీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తోంది. రాంచి ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇళ్ళపై కూడా దాడులు జరుగుతున్నాయి. బ్యాంకుల నుంచి ఈ కంపెనీ రూ. 1,064 కోట్ల రుణాలు తీసుకుని.. ఎగ్గొట్టిందని 2019లో సీబీఐకిబ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు 2020లో కంపెనీపై సీబీఐ చార్జిషీటు దాఖలైంది. ఈ చార్జిషీటు ఆధారంగా ఈడీ కేసును విచారిస్తోంది. హైదరాబాద్‌లోని మధుకాన్ ఇన్‌ఫ్రా ఆఫీస్‌తో పాటు ఆయన ఇంటిపై కూడా సోదాలు జరుగుతున్నాయి. రాంచి ఎక్స్‌ప్రెస్ వే కంపెనీ డైరెక్టర్లు కె శ్రీనివాసరావు, ఎన్ సీతయ్య, ఎన్ పృథ్వితేజ నివాసాలపై కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కంపెనీ తీసుకున్న రుణాలకు నామా నాగేశ్వరరావు వ్యక్తిగత పూచి ఇచ్చారు. నామా పృథ్వి తేజ ఆయన కుమారుడు. మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.