హైదరాబాద్ కల్యాణ్ నగర్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ భూముల వ్యహారంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నూతన భూసేకరణ చట్టం 2013 ప్రకారం సొసైటీకి నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు అందించిన రెండు నెలల్లోగా ఈ పరిహారం చెల్లించాలని, ఆదేశాలు వెలువరించిన నాటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చిచెప్పింది. కోర్టు ఖర్చుల కింద సొసైటీకి రెండు నెలల్లోగా రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. రాజకీయ ఒత్తిళ్లతో నాడు ఆక్రమణలు తొలగించకపోవడంతో ప్రస్తుతం ఖజానాపై సుమారు రూ.2 వేల కోట్లకు పైగానే భారం పడే అవకాశాలున్నాయి.