అయ్యన్న పాత్రుడికి ఊరట

మాజీ మంత్రి, సీనియర్‌ టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్న పాత్రుడిపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. పదేళ్లకు పైగా శిక్ష పడే సెక్షన్‌ 467 ఈ కేసులో వర్తించదని కోర్టు పేర్కొంది. సీఆర్‌పీసీ 41ఏ కింద అయ్యన్నకు నోటీసులు ఇవ్వాలసి సీఐడీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అయ్యన్న పాత్రుడు ఫోర్జరీ సంతకం కేసులో సీఐడీ విచారణ జరపుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. అయితే నోటీసు ఇచ్చి విచారణ జరపాలని స్పష్టం చేసింది.

Related Articles