స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. రాత్రి నాస్‌డాక్‌ నష్టాల్లో క్లోజ్‌ కాగా, ఇతర సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ఉదయం నుంచి మెజారిటీ ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ నష్టాల్లో ఉంది. హాంగ్‌సెంగ్ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 15,886ని తాకిన నిఫ్టి ఇపుడు 24 పాయింట్ల లాభంతో 15,877 వద్ద ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌ షేర్‌కు పెద్దగా మద్దతు లభించలేదు. ఈ స్థాయిలో లాభాల స్వీకరణ ఉంటుందా అన్నది చూడాలి. నిఫ్టి 15900 దాటితే 15,915 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. యూరో మార్కెట్ల తరవాత మద్దతు లభిస్తే నిఫ్టి 15930ని కూడా దాటొచ్చు. అధిక స్థాయిలో అమ్మి మళ్ళీ 15,850-15,830 వద్దకు వస్తే లాభాలు స్వీకరించండి. కొనాలంటే మాత్రం నిఫ్టి 15,800-15,810కు వస్తుందేమో చూడండి. ఇవాళ వీక్లీ డెరివేటివ్‌ క్లోజింగ్‌ ఉన్నందున ఆ ఛాన్స్‌ వస్తుందేమో చూడండి. నిఫ్టి రేంజ్‌ 15,810‌-15,910 మధ్య ఉండొచ్చు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎల్‌ అండ్‌ టీ 1,576.60 2.07
విప్రో 567.60 1.05
హెచ్‌సీఎల్‌ టెక్‌ 999.75 1.04
టెక్‌ మహీంద్రా 1,089.05 0.98
ఇన్ఫోసిస్‌ 1,589.50 0.80

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఓఎన్‌జీసీ 118.30 -2.07
ఎన్‌టీపీసీ 119.85 -0.75
హెచ్‌డీఎఫ్‌సీ 2,516.80 -0.56
టైటాన్‌ 1,702.45 -0.46 41,369
ఏషియన్‌ పెయింట్స్ 2,989.00 -0.43

Related Articles