‘పుష్ప’ నటుడు జగదీశ్‌ అరెస్ట్‌

‘పుష్ప’ సినిమాలో నటుడు అల్లు అర్జున్‌ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్‌ అలియాస్‌ కేశవను హైదరాబాద్‌, పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. జగదీశ్‌ వేధింపులతో ఓ మహిళా జూనియర్‌ అర్టిస్టు గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఆమె ఫొటోలను తీసి వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తానని జగదీశ్‌ను బెదిరించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. జగదీశ్‌ బెదిరింపుల కారణంగా మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న జగదీశ్‌ను ఎట్టకేలకు పంజగుట్టా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Related Articles