హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్లో రియల్ హీరో సోనూ సూద్ పేరు మీద ‘బిగ్గెస్ట్ ప్లేట్’ నాన్ వెజ్ బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, సోనూసూదే స్వయంగా ఈ ప్లేట్‌ను ప్రారంభించారు. ఇది ఎంత పెద్ద ప్లేట్ అంటే.. ఇందులో ఒకేసారి 15 నుంచి 20 మంది భోజనం చేయవచ్చు. సోనూ సూద్ ప్రారంభించిన తొలి బిగ్గెస్ట్ బిర్యానీని అనాథ పిల్లలు ఆరగించడం మరో విశేషం. శనివారం కొండాపూర్‌లోని జిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఇండియాస్ బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్‌ను సోనూసూద్ ప్రారంభించారు. ఈ బిగ్గెస్ట్ ప్లేట్ 8 ఫీట్ల విస్తీర్ణంతో ఉంది. ఈ ప్లేట్‌లో ఒకేసారి 15 నుంచి 20 మంది భోజనం చేసేందుకు అవకాశం ఉంటుందని జిస్మత్ మండీ నిర్వాహకులు తెలిపారు. ఇంత పెద్ద ప్లేట్ కలిగిన రెస్టారెంట్.. దేశంలో ఇదే మొదటిదని చెప్పారు. త్వరలో విజయవాడ, గుంటూరు, నెల్లూరుతో పాటు బెంగళూరులోని తమ బ్రాంచీల్లో ‘సోనూసూద్ బిగ్గెస్ట్ ప్లేట్ బిర్యానీ’ని అందుబాటులోకి తీసుకువస్తామని వారు తెలిపారు.
Related Articles
‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్
- December 6, 2023
మహిళ కిడ్నాప్.. గ్యాంగ్ రేప్
- February 20, 2023
హైదరాబాద్ చేరుకున్న తారకరత్న భౌతికకాయం
- February 19, 2023
Hyderabad: నేడు రాత్రి 10 తర్వాత ఫ్లై ఓవర్లు మూసివేత
- February 18, 2023
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
- February 14, 2023
రేపు సీఎల్పీ అత్యవసర భేటీ
- January 8, 2022