వైఎస్ షర్మిల అరెస్ట్‌

వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కారవాన్ లోకి వెళ్లి షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీసులు తీసుకెళ్లారు. షర్మిలను హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది. పాదయాత్రను మహబూబాబాద్ బేతోలులో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతోలులోని షర్మిల బస శిబిరం దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇప్పటికే షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

Related Articles