నారా లోకేష్, వంగవీటి రాధా భేటీ..

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్‌, రాధా ఇద్దరు కలిసి కొంతదూరం నడిచారు.. అనంతరం ఇద్దరు గంటసేపు క్యారవేన్‌‌లో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటూ కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాధా సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసే చేయాలని భావిస్తున్నారట.. అయితే ఇప్పటికే అక్కడ టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఉమా పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.. ఆయనకు టికెట్ ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఉమా అంశంపై రాధాతో చర్చించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని.. కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఇస్తామని రాధాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత.. క్యారవేన్ నుంచి రాధా నవ్వుతూ బయటకు వచ్చారు. తాను ఇక నుంచి వారానికి రెండు సార్లు యువగళంలో పాల్గొంటానని రాధా చెప్పారు. కొద్దిరోజులుగా రాధా పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది.. అయితే ఇంతలో లోకేష్‌ను కలవడం చర్చనీయాంశమైంది.

Related Articles