శ్రీకాళహస్తిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై టెన్షన్ చోటు చేసుకుంది. టీడీపీ నేతలు సూచించిన రూట్ మ్యాప్‌కు పోలీసులు నిరాకరించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున శ్రీకాళహస్తి పట్టణ చతుర్మాడా వీధుల్లోకి పాదయాత్రకు ప్రవేశం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. నిన్న విడిది చేసిన బైరాజు కండ్రిగ నుంచి తొట్టంబేడు మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. ఇక్కడి నుంచి కొత్త కండ్రిగ, రాజీవ్ నగర్ కాలనీ రామచంద్రపురం బంగారమ్మ కాలనీ మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వరకూ పాదయాత్ర జరగనుంది. ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి పట్టణ చతుర్మాడా వీధుల గుండా పంచాయతీ రాజ్ అతిథిగృహం, బీపీ అగ్రహారం, పొన్నాలమ్మ గుడి మీదుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద ఏర్పాటుచేసిన బస ప్రదేశానికి యాత్ర చేరుకునేలా టీడీపీ నేతలు రూట్ మ్యాప్ రూపొందించారు.
Related Articles
నారా లోకేష్, వంగవీటి రాధా భేటీ..
- March 8, 2023
లోకేష్ పాదయాత్రలో ఊహించని సీన్
- February 27, 2023
చర్చకు సిద్ధమా?
- February 24, 2023
పాపాల భైరవుడు కేసీఆర్‌తో కలవబోం
- February 23, 2023
లోకేష్ పాదయాత్రకు వెళ్లొద్దు!
- February 18, 2023
ఏపీకి జగరోనా వైరస్ పట్టింది
- February 16, 2023