చెన్నై: కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ కళకళ

దాదాపు ఆరు సంవత్సరాల తరవాత చెన్నై కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ పరుగులు తీస్తోంది. జయలలిత అనారోగ్యం, రాజకీయ అనిశ్చితి, చెన్నై వరదలతో పాటు అనేక కారణాల చెన్నై రియల్‌ ఎస్టేట్‌ కళ తప్పింది. కొత్త పరిశ్రమలతో పాటు సంప్రదాయిక పరిశ్రమలు మళ్ళీ పుంజుకోవడంతో కమర్షియల్‌ స్పేస్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది. సుమారు 60 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ను రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు అమ్మినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మళ్ళీ మాన్యూఫ్యాక్చరింగ్‌ కంపెనీలు చెన్నైకి వస్తున్నాయి. యాపిల్‌ కూడా తన ఫోన్ల తయారీ చెన్నై సమీపంలోనే ప్రారంభించనుంది. కమర్షియల్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరగడంతో పాటు రెంటల్స్‌ కూడా 15 శాతం దాకా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

Related Articles