ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు

ఈనెల 21వ తేదీ వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మొత్తం రాత్రి పది గంట ల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. పగటి పూట కర్ఫ్యూను ఎత్తివేసిన కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయిదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించింది. సరుకు కొనడానికి, సేవలు పొందడానికి కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తున్నవారికి ఈ నిబంధన వర్తించదని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నంత సేపూ మాస్క్‌తో ఉండాలని, లేకుంటే రూ. 100ఫైన్‌ వేయాలని పేర్కొంది. అలాగే మాస్క్‌లోని వారిని షాపు/సంస్థలోనికి రానిచ్చినవారికి రూ. 10,000 నుంచి రూ. 25,000 వరకు పరిస్థితిని బట్టి జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.

Related Articles