అమరావతి: 2,500 అసైన్డ్‌ భూముల్లో అ్రకమాలు

అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ సీఎం జగన్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసిన అసైన్డ్ భూములను అధికారులు గుర్తించారు. సుమారు 2,500 అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. అసలు అసైనీలకు యథాతథంగా ప్యాకేజీ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ సంబంధిత చట్టంలో సవరణలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గ్రామ సచివాలయం, వాలంటీర్ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణ కోసం కొత్త శాఖ ఏర్పాటు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

Related Articles