ఇది కాంగ్రెస్ దౌర్భాగ్యం. ఢిల్లీ నేతలేమో మోడీకి, రాష్ట్రాలకు సలహాలు ఇస్తుంటారు. కాని అదే పార్టీ ప్రభుత్వాలు ఏ స్థాయికి దిగజారి పోయాయంటే… చివరికి వ్యాక్సిన్లను కూడా అమ్ముకున్నాయి. వ్యక్తులు కాదు. ఏకంగా ప్రభుత్వమే. కేంద్రం నుంచి రూ. 400లకు కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను ప్రైవేట్ హాస్పిటల్స్ రూ. 1,060 పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మిందని అకాలీదళ్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవే వ్యాక్సిన్లను ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలకు రూ.1560లకు వస్తున్నాయని ఆయన చెప్పారు. దీంతో రెండు డోసులకు కలిపి ఒక్కో వ్యక్తి రూ. 3,000 నుంచి రూ. 3,200లు భరించాల్సి వస్తోందని అకాళీదళ్ ఆరోపిస్తోంది. మొహాలిలో ఒకే రోజు 35వేల వ్యాక్సిన్లు అమ్మి రూ. 2 కోట్ల లాభాలు గడించాయని అన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. తాము పంజాబ్ రాష్ట్రానికి రూ. 400 చొప్పున 1.4 లక్షల వ్యాక్సిన్లు అందించామని… వాటిని రాష్ట్ర ప్రభుత్వం రూ. 1000 చొప్పున 20 ప్రైవేట్ హాస్పిటల్స్‌కు అమ్ముకుందని ఆయన ఆరోపించారు.ఈ ఆరోపణలను పంజాబ్ ప్రభుత్వం ఖండించక పోవడం విశేషం. ఇక ఆరోగ్య శాఖ మంత్రి బీఎస్ సిద్ధూ మాట్లాడుతూ వ్యాక్సిన్లు తన పరిధిలో లేని అంశమని, దీనిపై విచారణకు ఆదేశించామని చెప్పారు.
Related Articles
నేడు సిద్ధిపేట జిల్లాలో పంజాబ్ సీఎం పర్యటన
- February 16, 2023
మార్చి 10న కౌంటింగ్
- January 8, 2022
GHMC: కాంగ్రెస్ తొలి జాబితా
- November 19, 2020